గర్భాశయంలో 12 కేజీల కణితి..! 1 d ago
AP: విశాఖ శృంగవరపుకోటలోని సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కోరాపుట్ కు చెందిన 55 ఏళ్ల భారతి పట్నాయక్ గర్భాశయంలో 12 కేజీల కణితి ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అరుదైన శస్త్రచికిత్స చేసి వైద్యులు కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా భారత్ పట్నాయక్ ఉన్నారని వైద్యులు తెలిపారు.